కొత్త రికార్డ్.. వేలంలో భారీ రేటు పలికిన బాలాపూర్ లడ్డూ

బాలాపూర్ : వేలంలో బాలాపూర్ లడ్డూ కొత్త రికార్డ్ సృష్టించింది. ఏటికేడు సరికొత్త రికార్డు సృష్టిస్తున్న బాలాపూర్ లడ్డూ రేటు.. ఈసారి రూ.16 లక్షల అరవై వేల రూపాయలు పలికింది. లడ్డూ కోసం ఈసారి 29 మంది పోటీపడ్డారు. వేలం పాట మొత్తం ఆసక్తికరంగా సాగింది. ఒకరిని మించి మరొకరు రేటు పెంచుకుంటూ పోయారు. చివరకు… బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం నేత టి. శ్రీనివాస్ గుప్తా బాలాపూర్ లడ్డూను 2018 ఏడాదికి సొంతం చేసుకున్నారు.

శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘానికి.. వారి కుటుంబసభ్యులకు ధన్యవాదాలు తెలిపారు నిర్వాహకులు. వేలం ముగిసిన వెంటనే శ్రీనివాస్ గుప్తా.. డబ్బులను బాలాపూర్ గణేశ్ భక్త సమాజానికి అందజేశారు. నిర్వాహకుల నుంచి లడ్డూను అందుకున్నారు.

గతేడాది జరిగిన వేలం పాటలో లడ్డూ రూ.15లక్షల 60 వేలు పలికింది. ఈసారి మరో లక్ష రూపాయలు ఎక్కువ పలికింది.

Posted in Uncategorized

Latest Updates