కొత్త స్లోగన్ : ప్రైవేట్ స్కూల్స్ లో చదివించే వారికి పెన్షన్, రేషన్ కట్

PRAIVETఅన్ని విధాల స్తోమత ఉండి.. పిల్లల్ని ప్రైవేట్‌ స్కూల్స్ చదివించే వారికి ప్రభుత్వ రాయితీలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. వేలకు వేలు ఫీజులు కడుతున్న వారికి ఉచిత పథకాలు ఎందుకు.. లక్షలకు లక్షలు డొనేషన్లు కట్టే వారికి ప్రభుత్వ పథకాలు అవసరమా.. ఈ మాట అంటున్నది మేం కాదండీ.. ఓ ప్రజాప్రతినిధి. ఆయన మాటలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా పుత్తూరు ఎంపీపీ గంజి మాధవయ్య చేసిన కామెంట్స్ ఇవి. ప్రైవేట్‌ స్కూల్స్ లో పిల్లలను చదివించే కుటుంబాలకు తెల్ల రేషన్‌కార్డు, పింఛన్ రద్దు చేయడంతో పాటు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కట్ చేస్తాం అంటున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఇషా విద్య ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశంలో ఆ సంచలన వ్యాఖ్యలు చేశారు. వేలు, లక్షల రూపాయలు ఖర్చు చేసి కార్పొరేట్ స్కూళ్లలో చదివించే స్తోమత ఉన్నప్పుడు.. ఆ కుటుంబాలకి సంక్షేమ పథకాలు అవసరమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, దుస్తులు అందిస్తున్నాం.. అన్ని అర్హతలున్న టీచర్ల తో బోధన చేస్తున్నా ప్రభుత్వ పాఠశాలలపై చిన్నచూపు తగదు అన్నారు.

ఎంపీపీ మాధవయ్యగారి ఆవేదనలో అర్థం ఉన్నా.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, నాణ్యమైన విద్య అందించటంలో ఉపాధ్యాయుల కృషి ఎంత ఉందో నిరూపించాల్సిన బాధ్యత కూడా ఉందంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించినప్పుడు.. ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ వైపు ఎందకు వెళతాం అని పేరంట్స్ అంటున్నారు. ఏదిఏమైనా మధవయ్య మాటల్లోనూ నిజం లేకపోలేదని మరికొందరు నెటిజన్లు అంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates