కొప్పుల ఈశ్వర్ కారుకి ప్రమాదం

koppulaకరీంనగర్ బైపాస్ రోడ్ లో యాక్సిడెంట్ జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కారును మరో కారు డీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు మంచిర్యాల జిల్లాకు చెందిన సుందారపు గోపాల్ గా గుర్తించారు. ఆయన తన కొడుకు పెళ్లి పత్రికలను వేములవాడ ఆలయంలో సమర్పించేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తి పరిస్థితి సీరియస్ గా ఉండడంతో వరంగల్ ఆస్పత్రికి తరలించారు. కొప్పుల ఈశ్వర్ డ్రైవర్ కారును డీజిల్ పోయించేందుకు తీసుకెళ్లిన టైమ్ లో యాక్సిడెంట్ అయింది.

Posted in Uncategorized

Latest Updates