కొమురెల్లి మల్లన్న గుడిలో ఆన్‌ లైన్‌ సేవలు

చేర్యాల : సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం కొమురెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆన్‌ లైన్‌ సేవలు అమలులోకి వచ్చాయి. నిన్న(బుధవారం) కొమురెల్లి ఆలయ కార్యాలయంలో ఈవో వెంకటేశ్‌ ఆధ్వర్యంలో చైర్మన్‌ సేవెల్లి సంపత్‌ ఆన్‌ లైన్‌ సేవలను ప్రారంభించారు. ఈ-దర్శన్‌ వెబ్‌ సొల్యూషన్‌ సంస్థ రూపొందించిన వెబ్‌సైట్‌ ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తేచ్చారు. స్వామివారి కల్యాణం, అభిషేకం, శాశ్వత పూజలు, శాశ్వత అన్నదాన సేవలకు ఆన్‌ లైన్‌ ద్వారా టికెట్లు జారీ చేస్తారు. దీంతో మల్లన్న ఆలయం ఆన్‌ లైన్‌ సేవలందించే ప్రధాన ఆలయాల సరసన చేరింది.

Posted in Uncategorized

Latest Updates