కొలువుల జాతర: రేపే 2,786 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

exam
ప్రభుత్వ కొలువుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది సర్కారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పలు ఉద్యోగ నియామకాలకు ప్రకటనలు విడుదలయ్యాయి. మొత్తం 2,786 పోస్టుల భర్తీకి TSPSC రేపు(శనివారం,జూన్-2) నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. వీటిలో గ్రూప్-4 పోస్టులు 1,521. ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 72, ASO 474 పోస్టులు, VRO 700, రెవెన్యూశాఖలో సీనియర్ స్టెనో 19 పోస్టులు.

విభాగాల వారిగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు… రెవెన్యూశాఖలో LD, జూనియర్ స్టేనో 15, టైపిస్ట్ 292, జూనియర్ అసిస్టెంట్స్ 217 పోస్టులను భర్తీ చేయనున్నారు .పంచాయతీరాజ్‌శాఖలో జూనియర్ అసిస్టెంట్స్ 53, టైపిస్ట్ 64, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్స్ 231, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్స్ 32, హోమ్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్స్ 22, సీనియర్ స్టెనో 6, జూనియర్ స్టెనో 335, టైపిస్ట్ 79 పోస్టులు తో పాటు పలు విభాగాల ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల కానుంది.

Posted in Uncategorized

Latest Updates