కోకో-కోలా ఆల్కాహాలిక్ డ్రింక్‌ వచ్చేసింది

డేడవరల్డ్ లోనే అతిపెద్ద కూల్ డ్రింక్స్ తయారీ సంస్థ కోకో-కోలా మొదటి సారిగా అంతర్జాతీయ మార్కెట్లోకి ఆల్కాహాలిక్ డ్రింక్‌ను విడుదల చేసింది. జపాన్ రాజధాని టోక్యోలో సోమవారం(మే-28) మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. జపాన్ దేశ ప్రజల కోసం వినూత్నంగా ఆల్కాహాలిక్ డ్రింక్‌ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. 125ఏళ్ల కంపెనీ చరిత్రలో జపాన్‌లో ఈ ప్రయోగం ప్రత్యేకమైనదని కోకా-కోలా ప్రెసిడెంట్ జార్జ్ గార్డునో తెలిపారు. జపాన్‌లోని దక్షిణ ఖుషు ప్రాంతంలో కొత్త ఉత్పత్తులు లెమన్-డూ డ్రింక్స్ మూడు రకాల్లో అందుబాటులో ఉంటాయి. ఈ డ్రింక్స్ 3శాతం, 5శాతం, 7శాతం ఆల్కాహాల్‌తో మార్కెట్లో లభించనన్నుట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 350 మిల్లీలీటర్ల సామర్థ్యం కలిగిన బాటిల్ ధర సుమారు 1.40 అమెరికన్ డాలర్లు. ఆదేశంలో వినియోగదారుల నుంచి లభించిన ఆదరణను బట్టి మిగతా దేశాల్లో ఈ ఉత్పత్తులను విడుదల చేసే అవకాశం ఉంది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ 1970లో వైన్ అమ్మకాలను ప్రారంభించినా 1983లో వదిలేసింది.

Posted in Uncategorized

Latest Updates