కోటికి లక్ష కమీషన్ : హైదరాబాద్ లో హవాలా లావాదేవీలు

hawala-arrest-hyd-cpహైదరాబాద్ లో హవాలా రాకెట్ ను పట్టుకున్నారు పోలీసులు . హైదరాబాద్ అబిడ్స్ లోని మహాలక్ష్మి జెమ్స్ అండ్ జువెలర్స్ కేంద్రంగా హవాలా వ్యాపారం నిర్వహిస్తున్న వారిని సోమవారం (ఫిబ్రవరి-12) నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు జయేష్ పటేల్ అలియాస్ అరుల్ తో పాటు వనరాజ్ సింహ్ బామర్ సింహ్, పటేల్ ప్రదీప్ కుమార్, గణేష్ సత్యనారాయణ్ సాబూ, బోనబోయిన విజ్ఞేశ్వర్, అరుణ్ కుమార్ అడ్చి ఉన్నారు.

నిందితుల నుంచి ఒక కోటి 40 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. హవాలా ఏజెంట్లతో లాభాలు ఎక్కువగా ఉంటాయని తెలుసుకుని ఈ బిజినెస్ మొదలు పెట్టారని తెలిపారు పోలీసులు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాసరావు, కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గుజరాత్ కు చెందిన జయేష్ పటేల్ 2009లో హైదరాబాద్ కు వచ్చి స్థిరపడ్డారు. బంగారం, వజ్రాల వ్యాపారం చేస్తున్నాడు. హవాలా వ్యాపారులతో పరిచయాలు ఏర్పడి, జయేష్ 0.6 నుంచి 0.8 శాతం కమీషన్ కు హవాలా రూపంలో డబ్బులు మార్చేవాడని తెలిపారు.

వాట్సాప్ ఓ నోటు సీరియల్ నెంబర్ ను పంపడం ద్వారా బ్లాక్ మనీని వైట్ గా, వైట్ మనీని బ్లాక్ గా మార్చేవాడని వెల్లడించారు. రాయలసీమ స్టీల్ రీ రోలింగ్ స్కాన్ ఎనర్జీ అండ్ పవర్ లిమిటెడ్ సంస్థలకు హవాలా ద్వారా డబ్బులు మార్చేవారని.. GST చెల్లించకుండా లావాదేవీలు నడిపేవారన్నారు. IT డిప్యూటీ డైరెక్టర్ రాజేష్, టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారని.. స్వాధీనం చేసుకున్న డబ్బును ఇన్ కం ట్యాక్స్ విభాగానికి అప్పగిస్తామని చెప్పారు సీపీ శ్రీనివాసరావు.

Posted in Uncategorized

Latest Updates