కోడి గుడ్డు కూర వండలేదని భార్యను చంపేశాడు

కోడి గుడ్డు కూర వండలేదని భార్యను తుపాకీతో కాల్చేశాడు ఓ భర్త. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లాలోని దేవ్‌దాస్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం జరగగా… ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 33 ఏళ్ల నవనీత్… మంగేశ్ శుక్లాకు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. నవనీత్ వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే నవనీత్ తాగుడుకు బానిస కావడంతో.. గురువారం(జూలై-12) ఫుల్ గా మందు కొట్టి ఇంటికొచ్చాడు. కోడి గుడ్డు కూర వండాలని భార్య ను డిమాండ్ చేశాడు. ఇందుకు ఆమె అంగీకరించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.

మద్యం మత్తులో ఉన్న నవనీత్ ఇంట్లోకి వెళ్లి తన తండ్రి లైసెన్స్‌డ్ గన్‌ను తీసుకువచ్చి భార్య శుక్లాపై కాల్పులు జరిపాడు.విషయం తెలుసుకున్న స్థానికులు తీవ్ర గాయాలపాలైన శుక్లాను చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందింది. శుక్లా సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు నవనీత్‌ను పోలీసులు శుక్రవారం(జూలై-13) అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి షాజహాన్‌పూర్ జిల్లా జైలుకు తరలించారు.

Posted in Uncategorized

Latest Updates