కోతుల బెడదపై కేంద్రం పట్టించుకోవాలి : ఎంపీ రామ్ కుమార్

పార్లమెంట్ లో మంగళవారం (జూలై-24) ఆసక్తికరమైన ప్రశ్నలను లేవనెత్తారు ఎంపీలు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసం వద్ద కోతుల బెడద పెరిగిపోతున్నదని ఓ ఎంపీ అనడంతో..అందూరు సపోర్ట్ చేశారు. కోతుల బెడద విషయాన్ని ఐఎన్‌ఎల్‌డీ ఎంపీ రామ్‌ కుమార్ కాశ్యప్ జీరో అవర్ సమయంలో రాజ్యసభలో లేవనెత్తారు. కోతులు నివాసాల ప్రాంగణంలో ఉన్న చెట్లపై నుంచి దూకి..అక్కడ ఆరేసిన బట్టలను ఎత్తుకెళ్తున్నాయని అన్నారు.

కోతులు తనపై ఓ సారి దాడి కూడా చేశాయని, కోతుల సమస్య తీరేందుకు ప్రభుత్వం పరిష్కారాన్ని సూచించాలని కోరారు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు దీనిపై మాట్లాడుతూ..ఉపరాష్ట్రపతి ఇంటి వద్ద కోతుల వీరంగం చేస్తున్నాయని అన్నారు. దీనిపై జంతు హక్కులు కార్యకర్తలు, కేంద్రమంత్రి మేనకాగాంధీ ఆలోచించి..పరిష్కారాన్ని సూచించాలని కోరారు.

 

 

Posted in Uncategorized

Latest Updates