కోదండరాం కారుకు యాక్సిడెంట్..తప్పిన ప్రమాదం

kodandaram11023JAC చైర్మన్ కోదండరాంకు తృటిలో ప్రమాదం తప్పింది. కోదండరాం వెళ్తున్న ఇన్నోవా కారు బైక్‌ను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన ఆదివారం (ఫిబ్రవరి-11) చిట్యాల మండలం వెలిమినేడు వద్ద హైవేపై జరిగింది. దీంతో కోదండరాం మరో వాహనంలో హైదరాబాద్ బయలుదేరారు. నల్గొండలో విద్యావంతుల వేదిక సదస్సును ముగించుకొని హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అయితే.. కోదండరాం, కారులో ఉన్న మిగితా వ్యక్తులంతా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. బైక్ పై వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను నార్కట్ పల్లి కామినేని హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదంలో కోదండరాం కారు నుజ్జు నుజ్జయింది. మరో వాహనంలో ఆయన హైదరాబాద్ చేరుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates