కోదండరాముడి కళ్యాణోత్సవంలో అపశృతి : ఈదురుగాలులతో వర్షం.. మహిళ మృతి

ేయకడప జిల్లాలోని ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. శుక్రవారం (మార్చి-30)  ఒంటిమిట్టలో ఒక్కసారిగా గాలి వాన.. ఉరుములు మెరుపులు రావడంతో..  భయంతో గుండెపోటుతో ఓ మహిళ మృతి చెందింది. కోదండరాముడి షెడ్డువద్ద మహిళ కుప్పకూలి చనిపోయింది. ఒంటిమిట్టలో వడగళ్ల వాన కురవడంతో కల్యాణ వేదిక వద్ద ఏర్పాటుచేసిన చలువ పందిళ్లు కుప్పకూలాయి. భారీ వర్షంతో విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అకాల వర్షంతో కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం.. వీస్తోన్న ఈదురు గాలులకు కల్యాణవేదిక వద్ద ఉన్న రేకులు ఎగిరి పడ్డాయి. దీంతో కొందరు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు.

Posted in Uncategorized

Latest Updates