కోదాడలో ఓటేసిన ఉత్తమ్ కుమార్ దంపతులు

 తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ లో తన భార్య పద్మావతి తో కలిసి ఓటు వేశారు. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌‌లో పోటీ చేస్తుండగా, ఆయన సతీమణి పద్మావతి కోదాడలో ఎన్నికల బరిలో ఉన్నారు.

ఇప్పటికే టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్  సిద్దిపేట జిల్లా చింతమడకలో తమ ఓటు  హక్కును వినియోగించుకున్నారు. టీజేఎస్ చీఫ్ కోదండరాం కూడా తార్నాకలో ఓటు వేశారు.

Posted in Uncategorized

Latest Updates