వంద అంటాం సార్.. అన్నీ అవుతాయా: బండ్ల గణేశ్

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే  బ్లేడ్ తో గొంతు కోసుకుంటానంటూ సవాల్ చేసిన సినీ నిర్మాత బండ్ల గణేశ్ రాష్ట్రమంతటా వైరల్ న్యూస్ అయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక… మీడియాకు కనిపించలేదు. అయితే సోమవారం తిరుమలకు వచ్చిన బండ్ల గణేశ్.. దర్శనం తర్వాత సాయంత్రం మీడియాతో మాట్లాడారు.

ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు చెప్పిన బండ్ల గణేశ్.. ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందని అనుకున్నామని కానీ ఓడిపోవటంతో మానసికంగా కుంగిపోయానన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించి టీఆర్ఎస్ కు పట్టం కట్టారని చెప్పారు. తాను అజ్ఞాతంలో లేనని.. మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదని ఇన్ని రోజులు మౌనంగా ఉండాల్సి వచ్చిందన్నాడు. బ్లేడ్ తో గొంతు కోసుకోవడం సవాల్ పై స్పందిస్తూ ‘కోపంలో వంద అంటాం సార్. అవన్నీ నిజం అవుతాయా. మీరు కోసుకోమంటే కోసుకుంటా.. మా వాళ్లకి ఉత్సాహం ఇద్దామని అలా అన్నా. కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యింది’ అని చెప్పారు బండ్లగణేశ్.

Posted in Uncategorized

Latest Updates