కోయంబత్తూరు జిల్లా కలెక్టర్‌ కు కరోనా పాజిటివ్

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా కలెక్టర్‌ కే రాజమణికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్నారు. సోమవారం ఉదయం నుంచి కలెక్టర్‌ జ్వరంతో బాధపడుతుండగా మంగళవారం ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇవాళ(బుధవారం) కలెక్టర్‌కు కరోనా సోకినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. కోవై మెడికల్‌ సెంటర్‌ అండ్‌ హాస్పిటల్‌లో కలెక్టర్‌ కరోనా చికిత్స తీసుకుంటున్నారు. కరోనా ను అరికట్టే క్రమంలో కలెక్టర్‌ కంటైన్మెంట్‌ జోన్లలో పర్యటించారని జిల్లా వైద్యాధికారి రామదురై మురుగన్‌ తెలిపారు. కలెక్టర్‌లో కరోనా లక్షణాలేవీ కనిపించలేదని చెప్పారు.

Latest Updates