కోర్కెలు తీరాలని: శివుడికి నాలుకను సమర్పించింది

somnath-mahadev-district-dedicated-saurath-village-madhubani_b57ca88c-1184-11e8-82d6-43c3cccec057 కొరిన కోర్కెలు తీరేందుకు ఓ మహిళ శివుడికి తన నాలుకను కోసి సమర్పించింది. చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లాలో  ఈ దారుణ ఘటన జరిగింది. కోర్బా జిల్లాకి చెందిన సీమాబాయి గోండ్(28) మహాశివరాత్రి సందర్భంగా బుధవారం(ఫిబ్రవరి14) ఉదయం నునేరా గ్రామంలోని శివాలయానికి వెళ్లింది. శివలింగానికి పూజలు చేసిన అనంతరం సీమాబాయి తన నాలుకను కోసి శివుడికి సమర్పించింది. ఆలయంలో తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న సీమాబాయిని స్థానిక గ్రామస్థులు ఆసుపత్రికి తరలించారు. తాను కోరిన కోరికలు తీరేందుకు నాలుకను శివుడికి సమర్పించిందని స్థానికులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates