కోర్టు కేసులు తేలగానే TRT ప్రక్రియ : కడియం

KADIYAMనాణ్యమైన విద్య అందించాలంటే అర్హులైన టీచర్లను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించామన్నారు డిప్యూటీ సీఎం, సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ చైర్మన్ కడియం శ్రీహరి. కేజీవీబీలకు డార్మెట్రీ, తరగతి  గదుల ఏర్పాటుకు నిధులివ్వాలని కోరామని చెప్పారు. దేశవ్యాప్తంగా బాలికల విద్యను ప్రోత్సహించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కడియం చైర్మన్ గా కమిటీ నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పలుమార్లు సమావేశమై చర్చించింది కమిటీ. మంగళవారం (జూన్-5) కేంద్ర మానవ వనరులశాఖ  మంత్రి ప్రకాశ్ జావదేకర్ కలిసి బాలిక విద్యాభివృద్ధికి అనుసరించాల్సిన విధి విదానాల తుది నివేదిక సమర్పించారు కడియం.

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తిచేస్తామన్నారు డిప్యూటీ సీఎం కడియ శ్రీహరి. కోర్టులో కేసులు పెండింగ్ ఉన్న కారణంగానే ఫలితాల ప్రకటన ఆలస్యమవుతోందనీ, అవి క్లియర్ కాగానే రిక్రూట్ మెంట్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. మెరిట్ లిస్టు విడుదల కోసం విద్యాశాఖ కూడా ఎదురుచూస్తోందన్నారు కడియం.

బాలికల విద్య, విద్యా ప్రమాణాల పెంపు, బాలికల డ్రాపవుట్ల తగ్గింపుపై.. రిపోర్ట్ లో కేంద్రానికి పలు సూచనలు చేశామని చెప్పారు కడియం. కేజీబీవీలలో ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ ప్రారంభిస్తున్నారని చెప్పారు. వరంగల్ జిల్లా మామునూరు ప్రభుత్వ పశువైద్య కళాశాలలో కోర్సుల ప్రారంభానికి.. నేషనల్ వెటర్నరీ కౌన్సిల్ డైరెక్టర్ కరుణ్ శ్రీధర్ అంగీకరించారని చెప్పారు కడియం. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రమాణాలపై.. టెక్ మహింద్ర అధినేత ఆనంద్ మహేంద్ర.. చేసిన కామెంట్ల లో వాస్తవం ఉందన్నారు. ఇంజనీరింగ్ విధానాన్ని పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తమ ప్రభుత్వం విద్యారంగాన్ని చాలావరకు ప్రక్షాళన చేసిందని చెప్పారు కడియం.

Posted in Uncategorized

Latest Updates