కోర్టు ఖర్చులు మిగులు : చైన్ స్నాచర్స్ లో LLB(లాయర్) స్టూడెంట్

chainసిటీలో మళ్లీ మొదలైన చైన్ స్నాచర్స్ పై సీరియస్ యాక్షన్ మొదలుపెట్టారు పోలీసులు. అందులో భాగంగా సీసీ కెమెరాలతోపాటు ఆయా సెంటర్లలో నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరు కరుడుగట్టిన చైన్ స్నాచర్స్ పట్టుపడ్డారు. వీరిలో విశ్వంభరరావు అనే యువకుడు ఉన్నాడు. పట్టుకున్న తర్వాత ఆ కుర్రోడి డీటెయిల్స్ మొత్తం పరిశీలించారు పోలీసులు. అవాక్కయ్యారు. ఎందుకంటే.. విశ్వంభరరావు చదువుకున్నది LLB.. లాయర్. కోర్టుకి వెళ్లి ప్రాక్టీస్ చేయాల్సిన కుర్రోడు.. ఇప్పుడు అదే కోర్టులో నిందితుడిగా నిలబడుతున్నాడు. జల్సాలకు అలవాటు పడి.. డబ్బుల కోసం అడ్డదారి పట్టినట్లు చెబుతున్నాడు.

మియాపూర్ దీప్తిశ్రీనగర్ కాలనీలో 13వ తేదీన రాత్రి ఓ మహిళ నుంచి చైన్ స్నాచింగ్ చేసిన కేసులో ఈ LLB స్టూడెంట్ తోపాటు.. మరొకరు నిందితులు. వీరిది సంగారెడ్డి. విలాసాలకు బానిస అయ్యి.. ఇలా చైన్ స్నాచింగ్స్ చేస్తున్నట్లు తేల్చారు పోలీసులు. ఇప్పటి వరకు డిగ్రీ, ఇంజినీరింగ్ స్టూడెంట్స్ తోపాటు.. ఓ పోలీస్ పుత్రరత్నం కూడా దొరికారు. ఇప్పుడు కోర్టులో న్యాయఅన్యాయాలు మాట్లాడిన వ్యక్తి.. బోనులో నిందితుడిగా నిలబడాల్సి వచ్చింది. పోనీలే.. కోర్టు ఖర్చులు అన్న మిగిలాయి అంటూ నెటిజన్లు చమత్కారాలు పోతున్నారు..

Posted in Uncategorized

Latest Updates