కోర్టు తీర్పు అనవసరం: గుళ్లోకి వస్తే నరికేస్తాం

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై తీవ్రంగా స్పందించారు బీజేపీ మద్దతుదారుడు, సినీ నటుడు కొల్లం తులసి. కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించే సాహసం చేసిన మహిళలను అడ్డంగా నరికేస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా ఎన్డీయే నిర్వహించిన ర్యాలీలో తులసి ఈ వ్యాఖ్యలు చేశారు. అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించే మహిళలను నరికేసి ఒక సగం కేరళ సీఎం పినరయి విజయన్ కి… మరో సగం ఢిల్లీకి పంపిస్తానన్నారు.

శబరిమల ఆలయంలోకి స్త్రీలను అనుమంతిచడమంటే అయ్యప్ప పవిత్రతని దెబ్బతీయడమేననీ… సుప్రీం తీర్పుపై మహిళలే వ్యతిరేకంగా ఉన్నారన్నారు తులసి.  సుప్రీం తీర్పుపై నిరసనలకు తోడు ఇప్పటికే పలువురు రివ్యూ పిటిషన్లు వేశారు. అయితే… శబరిమల తీర్పుపై అత్యవసరంగా రివ్యూ పిటిషన్‌లను విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం వ్యాఖ్యానించింది.

Posted in Uncategorized

Latest Updates