కోలాటానికి అరుదైన గుర్తింపు: వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం

kolatamజనజానపద వృత్తి కళాకారుల సమాఖ్య కోలాట బృందానికి వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం లభించింది. కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఈ కోలాట బృందం 1,500 మంది మహిళలతో కరీంనగర్‌ పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో గురువారం(ఫిబ్రవరి-22) 10 నిమిషాల పాటు కోలాటం చేసింది.

మహిళలు చేసిన కోలాటం.. వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదైంది. కోలాట బృందానికి వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ భారత ప్రతినిధి బింగి నరేందర్‌గౌడ్, జిల్లా ప్రతినిధి విజయభాస్కర్‌ సర్టిఫికెట్‌ ప్రదానం చేశారు. జిల్లాకు చెందిన జానపద కళాకారుల ప్రతినిధులు ఇస్మాయిల్, కృపాదానం సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

Posted in Uncategorized

Latest Updates