కోల్ ఇండియా లిమిటెడ్, NLCల మధ్య సోలార్ ఒప్పందం

కోల్ కతా : కోల్ ఇండియా లిమిటెడ్, నేవేలీ లిగ్నైట్ కార్పొరేషన్(NLC) కంపెనీల మధ్య సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఒప్పందం కుదిరింది. దేశంలో మూడు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్, రెండు వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ను ఉత్పత్తి చేసేందుకు రెండు కంపెనీలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. 12వేల కోట్ల రూపాయలతో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పాడు కోల్ ఇండియా ప్రతినిధి ఒకరు. ఈ ఒప్పందంతో కోల్ ఇండియా మొట్టమొదటిసారి సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి అడుగు పెడుతున్నట్లయ్యింది.

Posted in Uncategorized

Latest Updates