కోల్ కతాలో బాంబ్ పేలుడు..బాలుడు మృతి

పశ్చిమబెంగాల్:  దేశమంతా గాందీజయంతి వేడుకలతో శాంతి, అహింసా మార్గంలో కార్యక్రమాలు చేపడుతుండగా..కోల్ కతాలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. కోల్ కతాలోని డమ్‌ డమ్ నగర్‌ పండ్ల మార్కెట్‌లోని ఓ బిల్డింగ్ దగ్గర ఇవాళ (అక్టోబర్-2) బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఏనిమిదేళ్ల బాలుడు మృతిచెందాడు. మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. పేలుడుకు కారణం ఇంకా తెలియనప్పటికీ.. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఫోరెన్సిక్ నిపుణులు, సీఐడీ బాంబు డిస్పోజల్ స్కాడ్ సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పేలడు సంభవించిన భవనంలో డమ్‌ డమ్ మున్సిపాలిటీ చైర్మన్ పంచూరాయ్ కార్యాలయం ఉంది. పంచూరాయ్ టార్గెట్ గానే పేలుడుకు పాల్పడ్డట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. బాంబు పేళుడు జరగడంతో ..ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. చుట్టుపక్కలవారు భయంతో పరుగులు తీశారు.

Posted in Uncategorized

Latest Updates