కోల్ క‌తాలో నేల‌పై చంద‌మామ‌

moonకోల్‌కతాలోని విక్టోరియా మెమొరియల్ దగ్గర అతి పెద్ద చంద‌మామ‌ కొలువుదీరింది. 3 డీ ఆకారంలో ఉన్న భారీ చందమామను చూడటానికి అక్కడి ప్రజలు క్యూ కడుతున్నారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బ్రిటిస్ కౌన్సిల్ ఈ మ్యూజియం ఆఫ్ ద మూన్ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. విక్టోరియా మహల్ నార్త్ గేట్ దగ్గర ఈ భారీ చంద్రుడిని ఏర్పాటుచేశారు. నాసా కెమెరా సాయంతో తీసిన చంద్రుడి ఫొటోకు ఇది నకలు. బ్రిటిష్ ఆర్టిస్ట్ ల్యూక్ జెరామ్ దీనిని రూపొందించారు. దీని ఎత్తు 23 అడుగులు. అయితే అసలు చంద్రుడి కన్నా ఇది ఐదు లక్షల రెట్లు చిన్నగా ఉంది.

Posted in Uncategorized

Latest Updates