కోళ్లు తినేస్తున్నాయంట : మటన్, చికెన్ షాపుల్లో తూకం మోసం

chiken-muttonకిలో అంటే వెయ్యి గ్రాములు.. అదే చికెన్, మటన్ షాపుల్లో అయితే కిలో అంటే 900 గ్రాములు మాత్రమే. వాళ్లకేమైనా కొత్త రూల్ వచ్చిందా అంటే కానేకాదు. చికెన్, మటన్ షాపుల్లో తూకాలు అన్నీ మోసం అని తేల్చారు అధికారులు. తూనికలు, కొలతల శాఖ అధికారులు.. ఆదివారం సిటీలోని చాలా షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ మోసం బయటపడింది. 10కిలోలు తీసుకుంటే కిలో తక్కువ వస్తుంది. చికెన్, మటన్‌ షాపు ల్లోని ఎలక్ట్రానిక్‌ కాంటా సెట్టింగ్‌లో ఈ విధంగా ఫిట్టింగ్‌ చేశారు వ్యాపారులు. తూకంలో కిలో చికెన్‌ వెయ్యి గ్రాముల డిస్‌ప్లే ఉంటుంది.. వాస్తవంగా వచ్చేది మాత్రం 900 గ్రాములే. మిగతా 100 గ్రాములు కోడి తినేస్తుందంట. స్టాంపింగ్, రెన్యువల్‌ లేకుండా ఎలక్ట్రానిక్‌ కాంటాలు, వేయింగ్‌ మెషిన్లు వినియోగిస్తున్నట్లు గుర్తించి వాటిని సీజ్‌ చేసి కేసులు నమోదు చేశారు.

హైదరాబాద్ అంబర్‌పేటలోని చికెన్‌ సెంటర్లలో కిలోకి 100 గ్రాములు తక్కువగా తూకం వస్తున్నట్లు గుర్తించారు. ఎలక్ట్రానిక్‌ కాంటాపై 900 గ్రాముల చికెన్‌ పెడితే 1,000 గ్రాములుగా డిస్‌ప్లే చూపిస్తోంది. అదే 1000 గ్రాముల చికెన్‌ పెడితే 1100 గ్రాములు డిస్‌ప్లే చూపిస్తోంది. దీంతో 100 గ్రాముల ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. 10 కిలోలకు కిలో చికెన్‌ తక్కువగా తూకం వస్తున్నట్లు పసిగట్టారు. మొత్తం 10 కేసులు నమోదు చేశారు. మరో ఆరు దుకాణాల వేయింగ్‌ మెషిన్లను రెన్యువల్‌ చేయకుండానే వినియోగిస్తున్నట్లు గుర్తించారు. యూసుఫ్‌గూడలో 13, ఫలక్‌నుమాలో 6, సికింద్రాబాద్‌లో 6 కేసులు నమోదు చేశారు.

Posted in Uncategorized

Latest Updates