కోసి బయటకు తీశారు : అనకొండ కడుపులో 58 ఏళ్ల మహిళ

missing women in phyton stomachఇండోనేషియా దేశం.. మునా ఐలాండ్. చుట్టూ సముద్రం.. దట్టమైన అడవి. ఐలాండ్ లో చిక్కటి తోటలు. ఇక్కడే ప్రపంచంలోనే భయంకరమైన విష సర్పాలూ ఉన్నాయి. వాటిలో అతి పెద్దదైన అనకొండ కూడా ఉంది. దీనికి ఎవరైనా చిక్కితే చాలు.. అమాంతం మింగేస్తోంది. అనకొండ సినిమాలో చూపించినట్లు.. ఇక్కడ కూడా అలాంటి ఘటనే జరిగింది. ఐలాండ్ స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పెర్సియపన్ లావెలా గ్రామం ఉంది. వాటిబా అనే 58 సంవత్సరాల మహిళ ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తోటలో కూరగాయలు కోసుకుని వస్తానని చెప్పింది. ఎంత సేపటికీ తిరిగి రాలేదు. గ్రామం మొత్తం వెతికారు. ఎక్కడా కనిపించలేదు. ఆ గ్రామం చాలా చిన్నది కావటం.. ఎటు వెళ్లినా ఇట్టే కనిపేట్టే అవకాశం ఉండటంతో ఎంతోసపు పట్టలేదు వారికి. వెంటనే పోలీసులకు కంప్లయింట్ చేశారు. వారు వెతకసాగారు.

అలా వెతుకుతున్న సమయంలోనే.. ఓ తోటలో వారికి మహిళ వాటిబా చెప్పులు కనిపించాయి. వాటి జాడ ఆధారంగా వెళితే.. అతి పెద్ద అనకొండ కనిపించింది. అది 23 అడుగులు ఉంది. కదలటం లేదు. కడుపు అంతా లావుగా ఉంది. గ్రామస్తులకు అనుమానం వచ్చింది. వెంటనే దాన్ని బంధించారు. పొట్టకోసి చూశారు. అందులో వాటిబా మృతదేహం ఉంది. అందరూ షాక్ అయ్యారు. 20, 25 అడుగుల పొడవు ఉన్న కొండచిలువులు ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయంటున్నారు. పశువులపై దాడి చేసి తింటాయని.. మొదటిసారి ఇలా మనిషిని మింగటం జరిగిందంటున్నారు స్థానికులు.

Posted in Uncategorized

Latest Updates