కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్ అవార్డు

instagramawardభారత్‌లో 2017లో సోషల్ మీడియా నెట్‌వర్క్ ఇన్‌స్టాగ్రామ్‌లో మోస్ట్ ఎంగేజ్డ్ అకౌంట్‌లో భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అవార్డు లభించింది. ఈ సందర్భంగా విరాట్ అవార్డుతో ఉన్న ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో పాటు అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. కొంచెం ఆలస్యమైంది. అయినప్పటికీ ఈ అవార్డును ప్రకటించిన ఇన్‌స్టాగ్రామ్‌కు థాంక్స్ చెబుతున్నాను. ఎప్పుడు నాకు మద్దతుగా నిలిచి, ప్రేమను పంచిన అభిమానులకు థ్యాక్స్ అని తెలిపాడు. ఇది మీ వల్లే వచ్చిందని… నేను ఎప్పుడూ సరైన పనులు చేసేందుకు ప్రేరణగా నిలిచారంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

Posted in Uncategorized

Latest Updates