కోహ్లీ ఓ చెత్త ప్లేయర్ : నసీరుద్దీన్ షా

 టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పై బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ బెస్ట్ బ్యాట్స్ మెన్ మాత్రమే కాదు ప్రపచంలోనే చెత్త బిహేవియర్ కలిగిన ప్లేయర్ అని అన్నాడు. అతని చెత్త ప్రదర్శన వల్ల సాధించిన ఖ్యాతి, ప్రతిభలను కోల్పోతున్నాడని తెలిపారు. మొత్తానికి తాను దేశం వదిలి వెళ్లే ఉద్దేశం లేదని తన ఫేస్ బుక్ పేజ్ లో నసీరుద్దీన్ షా కామెంట్ చేశారు. ఈ విషయం పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కొందరు కోహ్లీకి సపోర్ట్ చేయగా మరికొందరు షా కు అనుకూలంగా స్పందిస్తున్నారు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండవ టెస్ట్ లో భాగంగా ఆస్ట్రేలియా కెప్టెన్ పైన్ కు కోహ్లీకి మాటల యుద్దం జరిగింది.  బుమ్రా బౌలింగ్‌లో మిడ్‌వికెట్‌ దిశగా ఆడిన పైన్‌ సింగిల్‌ తీస్తుండగా.. లాంగాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ క్రీజ్ వైపు దూసుకొచ్చాడు. కోహ్లీ, పైన్ ఒకరికొకరు అనుకోకుండా బాగా దగ్గరగా వచ్చారు. దీంతో.. ‘నేను నిన్నేమీ అనడం లేదు కదా. ఎందుకు ఆ అసహనం’ అని కోహ్లీ పైన్‌తో అన్నాడు. ‘నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎందుకు ప్రశాంతంగా లేవు’ అంటూ పైన్‌ బదులిచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. చివరికి ఎంపైర్ కలుగజేసుకుని ఇద్దరిని శాంతింప చేశాడు.

Virat K is not only the worlds best batsman but also the worlds worst behaved player. His cricketing brilliance pales…

Naseeruddin Shah 发布于 2018年12月16日周日

Posted in Uncategorized

Latest Updates