కోహ్లీ ఔట్ అయితే ఇలాగే చేస్తాడట. ఆస్ట్రేలియా జర్నలిస్ట్ ట్వీట్

పెర్త్ : టీమిండియా కెప్టెన్ కోహ్లీని ఎగతాళి చేశాడు ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్. డెన్నిస్ టరెన్ అనే జర్నలిస్ట్ శనివారం తన ట్విట్టర్ ఎకౌంట్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో ఓ బ్యాట్స్ మెన్ ఔట్ కావడంతో.. కోపంతో బ్యాట్ ను విరగ్గొడుతాడు. కోహ్లీ కూడా గ్రౌండ్ లో ఇలాగే ప్రవర్తిస్తాడని డెన్నిస్ ట్వీట్ చేశాడు.

కొద్దిరోజులుగా ఆసిస్ కెప్టెన్ టిమ్ పెయిన్ కు.. కోహ్లీకి మధ్య జరిగిన వివాదంపై దుమారం రేగగా.. డెన్నిస్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.

క్రికెట్ అభిమానులు డెన్నిస్ పై సీరియస్ అవుతున్నారు. ఆస్ట్రేలియా మాజీ సీనియర్ ప్లేయర్ వార్నర్ ఇలాగే ప్రవర్తించేవాడని నెటిజన్లు రీట్వీట్స్ చేస్తున్నారు.  కోహ్లీ నిజంగా బ్యాట్ విరగ్గొడ్తే ఆ వీడియోను పెట్టాల్సిందని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

https://twitter.com/DennisCricket_/status/1075888667019796480?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1075888667019796480&ref_url=https%3A%2F%2Fwww.timesnownews.com%2Fsports%2Fcricket%2Farticle%2Findia-vs-australia-2018-aussie-journalist-uses-random-video-to-take-a-dig-at-virat-kohli%2F335228

 

Posted in Uncategorized

Latest Updates