కోహ్లీ కంటే ఫాస్ట్ గా.. మిథాలీ అరుదైన రికార్డ్

MITHALIఉమెన్స్ క్రికెటర్, టీమిండియా వన్డే కెప్టెన్ మిథాలీరాజ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్  టీ20ల్లో భారత్‌ తరపున 2వేల పరుగుల మైలురాయిని దాటిన ఫస్ట్ భారత క్రికెటర్‌ గా ఘనత సాధించారు. ఇప్పటి వరకూ ఇంటర్నేషనల్  టీ20ల్లో భారత్‌ తరపున మహిళా, పురుషుల జట్టుల్లో  ఏ ఒక్కరు ఈ రికార్డును అందుకోలేదు.  కౌలాలంపూర్‌లో జరుగుతున్న మహిళల ఆసియా కప్‌ లో భాగంగా గురువారం (జూన్-7) శ్రీలంకతో జరిగన మ్యాచ్‌ లో మిథాలీ రాజ్‌ 23 బంతుల్లో 33 పరుగులు చేసి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. వీటితో కలుపుకొని  ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌ల్లో మొత్తం 2015 పరుగులను పూర్తి చేశారు. పురుషుల విషయానికొస్తే.. సెంచరీల మీద సెంచరీలు బాదే టీమిండియా  కెప్టెన్ కోహ్లీ ఈ రికార్డుకు అడుగు దూరంలో ఉన్నారు.

1983 పరుగులు చేసిన కోహ్లీ, మిథాలీ తరువాతి స్థానంలో ఉన్నారు. ఇప్పటికే 2వేల పరుగుల మైలురాయిని ఆరుగురు అందుకోగా మిథాలీ రాజ్‌ ఏడవ స్థానంలో ఉన్నారు. మహిళల తరపున ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌ కార్లోత్‌ ఎడ్వర్డ్‌ 2605 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నారు. ఇటీవలే అంతర్జాతీయ మహిళా వన్డే క్రికెట్‌లో అత్యధిక హాఫ్‌ సెంచరీలు నమోదు చేసిన రికార్డును మిథాలీ సొంతం చేసుకున్నారు. ఇంగ్లండ్‌ మాజీ క్రీడాకారిణి ఎడ్వర్డ్స్‌ పేరిట ఉన్న 55 హాఫ్‌ సెంచరీల రికార్డును మిథాలీ బ్రేక్‌ చేసిన సంగతి తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates