కోహ్లీ కోరిక తీర్చిన బీసీసీఐ : టూర్ కి భార్యలను తీసుకెళ్లడానికి ఓకే..కానీ

విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు టూర్‌ మొత్తం ఆటగాళ్ల భార్యలను లేదా గర్ల్ ఫ్రెండ్స్ ను అనుమతించాలంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభ్యర్ధనకు బీసీసీఐ ఓకే చెప్పింది. విదేశి టూర్‌ స్టార్ట్‌ అయిన పది రోజుల తర్వాత వెళ్లి పర్యటన ముగిసేవరకూ వారి భాగస్వాములు ఉండొచ్చని పాలకుల కమిటీ(సీఓఏ) నిర్ణయం తీసుకొంది. బీసీసీఐ ప్రస్తుత పాలసీ ప్రకారం విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల వెంట భార్యలు, వ్యక్తిగత సిబ్బందిని కేవలం రెండు వారాలు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ పాలసీని మార్చి, వారిని టూర్ మొత్తానికీ అనుమతించాలని కొన్ని రోజుల క్రితం కోహ్లి బీసీసీఐని కోరాడు. దీనిపై చర్చించడానికి గతవారం సీఓఏ హైదరాబాద్‌ వచ్చి.. కోహ్లితోపాటు కోచ్‌ రవిశాస్త్రి, రోహిత్‌ శర్మలతో  చర్చించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భార్యలు వెంట ఉంటేనే విదేశీ టూర్లలో ప్రదర్శన మరింత మెరుగవుతుందన్నది కోహ్లి చెబుతున్నాడు.

Posted in Uncategorized

Latest Updates