కోహ్లీ రికార్డ్ : ఇంటర్నేషనల్ టీ20లో టీమిండియా ఫస్ట్ ప్లేయర్

kohliటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. శుక్రవారం (జూన్-29) డబ్లిన్ వేదికగా ఐర్లాండ్ తో జరిగి రెండో టీ20 మ్యాచ్ లో ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు కోహ్లీ. ఓపెనర్ కేఎల్ రాహుల్‌ తో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించిన విరాట్ కోహ్లి.. దూకుడుగా ఆడే ప్రయత్నంలో జట్టు స్కోరు 22 వద్ద 9 పరుగులకే ఔటయ్యాడు. అయితే ఇంటర్నేషనల్ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు.

ఇంటర్నేషనల్ టీ20ల్లో అత్యధిక రన్స్ చేసిన లిస్టులో న్యూజిలాండ్ క్రికెటర్లు మార్టిన్ గప్తిల్ (2,271 రన్స్) అగ్రస్థానంలో ఉండగా, బ్రెండన్ మెక్‌ కలమ్ (2,140) రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో కోహ్లి(1,992) నిలిచాడు. భారత ప్లేయర్లలో మొదటి ప్లేయర్ గా ఈ రికార్డు కోహ్లీకే దక్కింది. ఈ క్రమంలోనే షోయబ్‌ మాలిక్‌(1,989)ను కోహ్లి వెనక‍్కినెట్టాడు. కోహ్లి మరో 8 పరుగులు చేస్తే.. టీమిండియా తరపున రెండు వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డుల్లో నిలవనున్నాడు. కోహ్లి తర్వాత టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌ మెన్స్ లిస్టులో  రోహిత్ శర్మ (1,949), సురేశ్ రైనా (1,509), మహేంద్రసింగ్ ధోని (1,455) ఉన్నారు. ఐర్లాండ్ మ్యాచ్ లో మిస్ అయిన 2 వేల రన్స్ రికార్డును.. జూలో 3 నుంచి ఆరంభం కానున్న ఇంగ్లండ్ టూర్ లో ఈ రికార్డును కొట్టడానికి చక్కటి అవకాశం ఉంది. సో త్వరలోనే మరో రికార్డును సొంతం చేసుకోనున్నాడు ఈ రికార్డుల వీరుడు.

Posted in Uncategorized

Latest Updates