కోహ్లీ సేన మళ్లీ విదేశాల బాట పట్టింది

KOHLIటీమిండియా కెప్టెన్ కోహ్లీ సేన మళ్లీ విదేశాల బాట పట్టింది. ఇందులో భాగంగా మొదట ఐర్లాండ్‌.. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ పర్యటన కోసం శనివారం(జూన్-23) కోహ్లీ ఆధ్వర్యంలో టీమిండియా బయలుదేరింది. ఈ నెల 27, 29న భారత్‌-ఐర్లాండ్‌ మధ్య రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ జరగనుంది. ఈ క్రమంలో టీమిండియా  ఆటగాళ్లు మొదట ఐర్లాండ్‌ పర్యటనకు బయలుదేరారు.

ఐర్లాండ్‌లో పర్యటన తర్వాత కోహ్లీ సేన అటు నుంచి అటే ఇంగ్లాండ్‌ వెళ్తుంది. జులై 3 నుంచి భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య టీ20 సిరీస్‌ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వన్డే, టెస్టులు ఆడనుంది. ఇంగ్లాండ్ గడ్డపై ఎలాగైనా టెస్టు సిరీస్‌ ను సొంత చేసుకోవాలనే పట్టుదలతో ఉంది టీమిండియా.

Posted in Uncategorized

Latest Updates