కౌంటింగ్ కు అన్నీ సిద్ధం : కేంద్రాల వద్ద మూడంచెల భద్రత

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 11 వ తేదీన జరగనుంది. ఇప్పటికే కౌంటింగ్ కు అన్నీ సిద్ధం చేశామని రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు. కౌంటింగ్ రోజున కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు. ఆ రోజున ఎలాంటి సభలకు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశామని.. మొదటి అంచెలో వాహనాల తనిఖీ ఉంటుందన్నారు. రెండవ అంచెలో 500 మీటర్ల వరకు కౌంటింగ్ కేంద్రానికి చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటు చేశామన్నారు.  కేంద్ర భద్రతా బలగాలు, పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని తెలిపారు. పాస్లు ఉన్నవారికి మాత్రమే లోపలికి అనుమతిస్తామని చెప్పారు. సెల్ ఫోన్లు కౌంటింగ్ కేంద్రాలలోపలికి అనుమతించబడవన్నారు. మీడియా పాసులను డీపీఆర్వో ఇస్తారని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates