కౌంట్ డౌన్: రేపు నింగిలోకి  PSLV-C 41

pslv-c41మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్దమైంది ఇస్రో. PSLV-C 41 ప్రయోగానికి కౌంట్ డౌన్ కొనసాగుతోంది. నిన్న(మంగళవారం) రాత్రి  8 గంటల 4 నిమిషాలకు మొదలైన కౌంట్ డౌన్…32 గంటల పాటు ఉంటుంది. రేపు(గురువారం,ఏప్రిల్-12) తెల్లవారుఝామున 4 గంటల 4 నిమిషాలకు PSLV-C 41 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.

PSLV-C 41 ద్వారా… 14వందల 25 కిలోల బరువున్న IRNS-1ఐ ఉపగ్రహాన్నినింగిలోకి మోసుకెళ్లనుంది. ఈ ప్రయోగం ద్వారా ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సిరీస్ లో ఎనిమిదో ఉపగ్రహాన్ని రోదసీలోకి ప్రవేశపెట్టనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. IRNS-1ఐ ఉపగ్రహాన్నినింగిలోకి పంపటంతో…మనదేశంతో పాటు సరిహద్దుల నుంచి 15 వందల కిలో మీటర్ల వరకు GPS సిస్టమ్ కు దిక్సూచిలా పనిచేయనుంది. PSLV సిరీస్ లో ఇది 43వ రాకెట్ కాగా…ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లలో ఇది 20వ ప్రయోగం.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇస్రో ఛైర్మన్ శివన్. ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. గురువారం ఉదయం పీఎస్ఎల్వీ సీ-41 ప్రయోగం ఉండటంతో.. ఆనవాయితీగా స్వామివారి దర్శనం చేసుకుని.. ప్రత్యేక పూజలు చేశారు. ఈ ప్రయోగం ద్వారా నావిగేషన్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు.

ఈ ప్రయోగంతో స్వదేశీ నావిగేషన్ వ్యవస్థపై పూర్తి స్థాయిలో పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తోంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.

Posted in Uncategorized

Latest Updates