క్యాంప్ @ హైదరాబాద్ : తాజ్ కృష్ణాలో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

Karnataka-mlas-HYDకర్నాటక క్యాంపు రాజకీయాలు స్పీడందుకున్నాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు మారాయి క్యాంపు రాజకీయాలు. పవర్ గేమ్ లో పైచేయి సాధించేందుకు నిన్నటి నుంచే వ్యూహాలు ప్రతివ్యూహాల్లో BJP, కాంగ్రెస్-JDS మునిగిపోయాయి. కర్ణాటక CMగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం కావడమే లేటు…ఆపరేషన్ కమల్ మొదలుపెట్టింది BJP. మరోవైపు గవర్నర్ నిర్ణయంపై నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్, JDS నేతలు..రిసార్ట్ రాజకీయాలతో BJP కంటే ఓ అడుగు ముందే ఉండేలా ఎత్తులు వేస్తున్నారు. రెండు పార్టీల MLAలను మొదట్లో కొచ్చిన్ కు షిప్ట్ చేయాలనుకున్నా..తర్వాత వ్యూహం మార్చారు కాంగ్రెస్, JDS నేతలు. రెండు పార్టీల MLAలను ప్రస్తుతం హైదరాబాదలోని తాజ్ కృష్ణా హోటల్ కు షిప్ట్ చేశారు. మాజీ మంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలో క్యాంపుల్ని నడిపిస్తున్నారు రెండు పార్టీల నేతలు.

Posted in Uncategorized

Latest Updates