క్యాన్సర్ కాటు… ఈ ఏడాదిలో 8.1 లక్షల మంది మృతి

దేశాన్ని క్యాన్సర్ కాటేస్తోంది. ఏటికి ఏడు క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ ఏడాది 8.1 లక్షల మంది క్యాన్సర్‌‌తో మరణించినట్లు కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి అనుప్రియా పటేల్‌ నిన్న(శుక్రవారం) లోక్‌సభలో తెలిపారు. ప్రతి ఏడాది క్యాన్సర్ మరణాలు పెరిగిపోతున్నాయని… ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) రిపోర్టు ప్రకారం 2018లో 15.86 లక్షల కొత్త కేసులు నమోదైనట్లు ఆమె చెప్పారు.

2017లో 7.66 లక్షల మంది క్యాన్సర్‌‌‌తో చనిపోయారన్నారు. 2017లో 15.17 లక్షలు, 2016లో 14.51 లక్షల కేసులు రిజిస్టర్‌ అయినట్లు తెలిపారు.క్యాన్సర్, డయాబెటిస్‌, గుండె సంబంధిత జబ్బుల నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ హెల్త్‌‌‌‌‌‌‌‌ మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం)ను అమలు చేస్తోందని అనుప్రియా చెప్పారు. గొంతు, రొమ్ము, సెర్వికల్‌ క్యాన్సర్ పై ఎక్కువగా ఫోకస్‌ చేస్తున్నామని వీటితో పాటు బీపీ, డయాబెటిస్‌, ఇతర క్యాన్సర్ల వ్యాప్తిని నిరోధించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

Posted in Uncategorized

Latest Updates