క్యూబాలో ఘోర విమానం ప్రమాదం..100 మంది మృతి

CUBAవిమానం ప్రమాదంలో 100 మంది మరణించిన ఘటన క్యూబాలో జరిగింది.  జోస్‌ మార్టి ఎయిర్ పోర్ట్ నుంచి శుక్రవారం (మే-18) ఉదయం 11 గంటల సమయంలో టేకాఫ్‌ తీసుకున్న బోయింగ్‌ 737 ఫ్లైట్ కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు 9 మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం. అందులో 100 మంది మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించారు. క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్‌ డియాజ్‌ కేనెల్‌ ప్రమాద స్థలాన్ని సందర్శించి..సంతాపం తెలిపారు. చాలామందిని అంబులెన్సుల్లో తీసుకెళ్లడం చూశామని సంఘటన స్థలం వద్ద ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. గాయపడినవారిని హస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు డాక్టర్లు. శవాలను వెలికితీస్తున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తిగా కాలిపోవడంతో మృతులను గుర్తించలేకపోతున్నారు అధికారులు.  ప్రమాదానికి గురైన బోయింగ్‌ 737-201 విమానం 1979లో తయారైంది. దాన్ని క్యూబన్‌ ఎయిర్‌ లైన్స్‌ అద్దెకు తీసుకుని నడుపుతుందని తెలిపారు ఎయిర్ పోర్ట్ అధికారులు.

Posted in Uncategorized

Latest Updates