క్యూ బాధ తప్పింది : ఫోన్ ద్వారానే రైల్వే సాధారణ టికెట్ బుకింగ్

రైలు వచ్చి ఆగింది.. బయలుదేరుతున్నట్లు రైలు కూత పెట్టింది.. టికెట్‌ కౌంటర్‌లో చాంతాడంత లైన్.. సమయంలోగా టికెట్‌ దొరుకుతుందా.. రైలు ఎక్కుతామా? ఒకటే ఆందోళన.. ఇది జనరల్‌ బోగీల్లో వెళ్లే ప్రయాణికుల సమస్య. ఈ సమస్యకు తెరపడనుంది. సాధారణ (జనరల్‌) టికెట్లను మొబైల్‌ ఫోన్‌ నుంచి క్షణాల్లో తీసుకునే అవకాశాన్ని కల్పించబోతుంది దక్షిణ మధ్యరైల్వే.

UTS ఆన్‌ మొబైల్‌ పేరుతో యాప్‌ తీసుకొచ్చింది. జోన్‌ పరిధిలోని అన్ని స్టేషన్లలో యూటీఎస్‌ ఆన్‌ మొబైల్‌ సేవలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ యాప్‌తో ఎక్కడి నుంచైనా, ఎన్ని రోజుల ముందైనా జనరల్‌ టికెట్‌ తీసుకునే అవకాశం ఉంది. ఈ విధానంలో ముందుగా యాప్ లో మన రిజిస్టర్ కావాలి. పేరు, అడ్రస్, ఫోన్‌ నెంబరు వివరాలను నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత రైల్వే వాలెట్‌లో డబ్బు వేయాలి. టికెట్‌ తీసుకున్నప్పుడు ఈ వాలెట్‌ నుంచి డబ్బులు కట్ అవుతాయి. ప్రయాణం వాయిదా పడితే.. యాప్‌ ద్వారా టికెట్‌ను రద్దు చేసుకునే అవకాశం కూడా ఇందులో ఉంది.

Posted in Uncategorized

Latest Updates