క్రికెటర్లకు BCCI షాక్ : భార్యలను తీసుకురావద్దు

భారత క్రికెటర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది BCCI. మ్యాచ్ జరిగే ప్రదేశాలకు క్రికెటర్ల భార్యలను తీసుకురావద్దని స్పష్టం చేసింది. ఇంగ్లండ్‌ తో జరిగే ఫస్ట్ మూడు టెస్టుల వరకు భారత ఆటగాళ్లు తమ భార్య, ప్రియురాళ్ల కు దూరంగా ఉండాలని సూచించింది BCCI. ఎప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్లినా సహజంగా క్రికెటర్లు తమ భార్యలతో కలిసి వెళుతుండడం తెలిసిందే. ఇటీవలి వన్డే సిరీస్‌ ముగిశాక కోహ్లీ, ధవన్‌, ఉమేశ్‌ మరికొంత మంది ఆటగాళ్లు తమ భార్యలతో కలిసి టూర్ లకు వెళ్లారు. వీటికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. కనీసం నెల రోజులపాటు తమ జీవిత భాగస్వామి, స్నేహితురాళ్లకు దూరంగా ఉండాలని బీసీసీఐ చెబుతోంది. చాలా సందర్భాల్లో ఆటగాళ్ల వైఫల్యాలకు వారి కుటుంబ సభ్యులే కారణమంటూ విమర్శలు వచ్చాయి. ఇప్పటికే వన్డే సిరీస్‌ కోల్పోవడంతో ఇక కీలకమైన టెస్టు సిరీ్‌స్ లో ఫలితం ప్రతికూలంగా వస్తే ఇలాంటి విమర్శల దాడి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ముందు జాగ్రత్తగా కనీసం మూడు టెస్టుల వరకైనా ఫ్యామిలీని దూరంగా పెట్టుకోమ్మని సూచించింది BCCI. మరి చూడాలి భార్యలు స్టేడియంలో లేకపోతే మనోళ్లు సత్తాచాటుతారో లేదో.

Posted in Uncategorized

Latest Updates