క్రికెట్ చరిత్రలోనే రికార్డ్ : 18 రన్స్ కే ఆలౌట్

క్రికెట్ లో పరుగులతో అదరగొట్టినా రికార్డే..కుప్పకూలిన రికార్డే. పరుగుల పరద పారే టీమ్ ఓ చెత్త రికార్డును మూటకట్టుకుంది. ఇంగ్లాండ్‌ లో షెపర్డ్ నీమే కెంట్ క్రికెట్ లీగ్‌ కొత్త చరిత్ర సృష్టించింది. క్రికెట్ చరిత్రలో ఎవరూ ఊహించని సరికొత్త రికార్డు. ఫస్ట్‌ క్లాస్ క్రికెట్ టోర్నీలో  టార్టెన్ టీమ్ 12 నిమిషాల్లోనే ఛేదించగా.. దీంతో మ్యాచ్ 61 నిమిషాల్లోనే ముగిసిపోయింది. 152ఏళ్ల ఇంగ్లాండ్ క్లబ్ చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదైంది.

లీగ్‌ లో భాగంగా బెకన్హమ్, బెక్స్‌ లీ మధ్య మంగళవారం (జూలై-24) టీ20 మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెకన్హమ్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో  18 పరుగులకు ఆలౌటైంది. 42 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసిన ఆజట్టులో ఐదుగురు బ్యాట్స్‌ మెన్ డకౌట్‌ గా వెనుదిరిగారు. ఏ ఒక్క ఆటగాడూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ముగ్గురు బ్యాట్స్‌ మెన్ తలో నాలుగు పరుగులు మాత్రమే చేశారు. ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. కాలమ్ మాక్‌ లీడ్ ఆరు ఓవర్లు వేసి ఆరు వికెట్లు తీయగా.. జాసన్ బెన్ 5.2 ఓవర్లలో నాలుగు వికెట్లు పడగొట్టాడు. లక్ష్య ఛేదనకు దిగిన బెక్స్‌లీ జట్టు 3.3 ఓవర్లలో అలవోకగా టార్గెట్‌ను ఛేదించింది. క్రిష్టోఫర్ లాస్(4), ఎయిడెన్ గిగ్స్(12) మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడి చరిత్రాత్మక విజయాన్ని అందించారు.

Posted in Uncategorized

Latest Updates