క్రికెట్ తోపులు : వన్డేల్లోనూ టీమిండియా నెంబర్ వన్

marsసౌతాఫ్రికాతో జరిగిన ఐదో వన్డేలో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా మరో ఘనత సాధించింది. ఇప్పటికే 5,313 పాయింట్లతో టెస్ట్ మ్యాచ్ ల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది భారత్. మంగళవారం సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించడంతో 7,426 పాయింట్లతో వన్డేల్లో నెంబర్ 1 ప్లస్ లోకి వచ్చింది. ఆ తర్వాత స్ధానంలో 4,484 పాయింట్లతో టెస్ట్ మ్యాచ్ ల్లో, 6,839 పాయింట్లతో వన్డేల్లో  సౌత్ ఆఫ్రికా నిలిచింది. వన్డేల్లో మొదటి ర్యాంక్ సాధించడంపై టీమ్ ఇండియా క్రికెటర్లు ఆనందం వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) అభినందనలు తెలిపింది. ఏ స్టేడియమైనా, ఏ దేశ ఆటగాళ్లతో అయినా సరే రికార్డులను తిరగరాయడంలో భారత ఆటగాళ్లు ఎప్పుడూ ముందుంటారని BCCI తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates