క్రికెట్ లో వింత ఔట్ : హెల్మెట్ తగిలి పెవిలియన్

cricketక్రికెట్ లో ఔట్ అంటే ఎలా ఉంటుంది. బాల్ తగిలి వికెట్లు లేస్తాయి. లేదంటే LBW, లేకపోతే క్యాచ్, రనౌట్, స్టంప్స్ కు బ్యాట్ తగలటం.. ఇలా ఉంటుంది. వీటన్నింటికీ భిన్నంగా హెల్మెట్ తగిలి బ్యాట్స్ మెన్ ఔట్ అయిన అరుదైన సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..

టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హెల్మెట్ తగిలి వికెట్లు పడటంతో.. పెవిలియన్ బాట పట్టాడు న్యూజిలాండ్‌ బ్యాట్స్ మన్ మార్క్‌ చాప్‌మన్‌. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆసీస్‌ బౌలర్‌ స్టాన్‌ వేసిన బాల్ హిట్‌ చేయబోయాడు. ఆ సమయంలో మార్క్ హెల్మెట్‌ కింద పడింది. అది వెళ్లి వికెట్లపై పడింది. బేల్స్ లేచాయి. అంఫైర్ ఔట్ గా ప్రకటించాడు. క్రికెట్ లో ఇలా కూడా ఔటవుతారా అంటూ ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ ఇలాంటి ఔట్ చూడలేదు అంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి..

Posted in Uncategorized

Latest Updates