క్రికెట్ సరిహద్దులు లేని ఆట : ఎన్టీఆర్

NTRమాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంటే తనకు అభిమానమని తెలిపాడు హీరో ఎన్టీఆర్. IPL మ్యాచ్‌ల తెలుగు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్..మంగళవారం (ఏప్రిల్-3) హైదరాబాద్ లోని పార్క్ హయత్‌లో జరిగిన IPL వేడుకలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ..సింహాద్రి సినిమా విజయం తొలి సిక్స్ కొట్టినంత ఆనందం ఇచ్చిందన్నాడు.

క్రికెటర్ల జీవితాలు సిల్వర్‌ స్క్రీన్‌ పైకి రావడం ఆనందంగా ఉందని, క్రికెటర్ల బయోపిక్స్ చేయడానికి తాను సాహసం చేయనని చెప్పాడు. ఆట కూడా ఒక భాషే అని తన అభిప్రాయమని, క్రికెట్ సరిహద్దులు లేని ఆట అని అన్నాడు. చిన్నప్పుడు నాన్నతో కలిసి క్రికెట్‌ మ్యాచ్‌లు చూసేవాడినని.. మా అబ్బాయికి క్రికెట్‌ నేర్పిస్తానని చెప్పాడు . రాజమౌళి ఇంకా కథ పూర్తిగా చెప్పలేదని, సినిమాకు సిద్ధం కావాలన్నారని చెప్పిన జూనియర్.. ఎన్టీఆర్‌ బయోపిక్‌ నుంచి ఎలాంటి పిలుపు రాలేదన్నాడు.

ఏప్రిల్ 7 నుంచి IPL 11వ సీజన్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

 

Posted in Uncategorized

Latest Updates