క్రిప్టో కరెన్సీ కేసు : విచారణలో శిల్పాశెట్టి భర్త

SHILPAఇటీవల పూణెలో వెలుగు చూసిన వేల కోట్ల రూపాయల క్రిప్టో కరెన్సీ కుంభకోణం కేసులో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపార వేత్త అయిన రాజ్‌ కుంద్రాను  ఈడీ అధికారులు కుంద్రాను విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసు సందర్భంగా మంగళవారం (జూన్-5) రాజ్‌ కుంద్రాను ముంబయి బ్రాంచికి చెందిన ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ప్రశ్నించారు.

విచారణ అనంతరం.. కొన్ని అనుమానాస్పద లావాదేవీలు గుర్తించిన క్రమంలో రాజ్‌ కుంద్రాను ప్రశ్నించేందుకు పిలిచామని వెల్లడించారు అధికారులు. కుంద్రా మంగళవారం (జూన్-5) ఉదయం దక్షిణ ముంబయిలోని ఈడీ జోన్‌ 2 కార్యాలయానికి వచ్చారు. ఆయనను ప్రశ్నిస్తున్నామని ఈడీ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. కొన్ని గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగొచ్చని వెల్లడించారు. క్రిప్టో కరెన్సీ కుంభకోణంలో మనీలాండరింగ్‌ జరిగిందా అనే కోణంలో ఈడీ దర్యాప్తు జరుపుతోంది.

ఇదే కేసులో త్వరలో శిల్పాశెట్టితో పాటు సన్నీలియోన్‌ సహా మరికొందరిని ప్రశ్నించవచ్చని భావిస్తున్నారు. రాజ్‌ కుంద్రాను ఈడీ ప్రశ్నించిన క్రమంలో హైప్రొఫైల్‌ సెలెబ్రిటీలు సన్నీ లియోన్‌, ప్రాచీ దేశాయ్‌, ఆరతి చభ్రియా, సోనాల్‌ చౌహాన్‌, కరిష్మా తన్నా, జరీన్‌ ఖాన్‌, నేహ ధూపియా, హ్యూమా ఖురేష్‌, నర్గీస్‌ ఫక్రీ తదితరుల పేర్లు ప్రస్తావించినట్టు తెలిసింది.

రాజ్‌కుంద్రా భార్య శిల్పాశెట్టిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో నిందితుడైన అమిత్‌ భరద్వాజ్‌ కంపెనీకి దుబాయ్‌, సింగపూర్‌ లలో ఈ సెలబ్రిటీలు సహకరించినట్టు ఈడీ ఆరోపిస్తోంది. పూణేకు చెందిన వ్యాపారి భరద్వాజ్‌ ను ఆరునెలల కిందట ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్‌ చేశారు.

 

 

 

 

 

Posted in Uncategorized

Latest Updates