క్రిమినల్ లా సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం

పార్లమెంట్ డల్ గా నడిచింది. లోక్ సభ బాగానే జరిగినా… రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడి చివరగా రేపటికి వాయిదా పడింది. లోక్ సభలో మాత్రం ప్రశాంతంగా చర్చ జరిగింది. క్రిమినల్ లా సవరణ బిల్లును లోక్ సభ ఆమోదించింది. MIM తప్ప మిగతా పార్టీలన్నీ బిల్లుకు మద్దతు తెలిపాయి. బిల్లును వ్యతిరేకించిన MIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ… రేప్ కేసులలో మరణ శిక్ష వద్దన్నారు. లా కమిషన్ కూడా రేప్ కేసులలో మరణ శిక్షను సిఫారసు చేయలేదన్నారు. దేశంలో చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టుల ఏర్పాటుతో పాటు… మహిళా పోలీసుల సంఖ్యను పెంచాలన్నారు. ఈ బిల్లు చట్టంగా మారితే… సౌదీ అరేబియా, ఇరాన్, చైనాల లాగా ఇండియా మారిపోతుందన్నారు.

బిల్లుపై చర్చకు సమాధానమిచ్చారు హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు. మహిళా రక్షణ కోసమే ఈ బిల్లు తీసుకొచ్చామన్నారు. హోంశాఖ ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఫర్ విమెన్ సేఫ్టీ ఏర్పాటవుతుందన్నారు. అంతకుముందు హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ చట్ట సవరణ బిల్లును కూడా లోక్ సభ ఆమోదించింది. చర్చలో మాట్లాడిన TRS MP బూర నర్సయ్యగౌడ్… తెలంగాణలో హోమియోపతి ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కోరారు. హోమియోపతి పేరుతో తప్పుడు ప్రకటనలను అరికట్టాలన్నారు.

ఇక రాజ్యసభలో బిజినెస్ జరగలేదు. పొద్దున సభ ప్రారంభం కాగానే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు NRC విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభను వాయిదా వేశారు చైర్మన్ వెంకయ్య. తర్వాత కూడా అదే పద్దతి కొనసాగడంతో ఒకసారి 10నిమిషాలు వాయిదా వేసిన వెంకయ్య… తర్వాత రేపటికి వాయిదా వేశారు.

Posted in Uncategorized

Latest Updates