క్రిస్టియన్లపై వివాదాస్పద వ్యాఖ్యలకు MP వివరణ

GOPALక్రిస్టియన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముంబై నార్త్ బీజేపీ MP గోపాల్ శెట్టి తను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. తన స్టేట్ మెంట్  అవాస్తవమని గోపాల్ శెట్టి అన్నారు. అవసరమైతే ఎంపీ పదవికి రాజీనామా చేసేందేకు సిద్దమని, ఇదే విషయంపై స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ తో కూడా చర్చించేందుకు సిద్దమని తెలిపారు. ఎవ్వరికీ వ్యతిరేకంగా తాను వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలు వక్రీకరించారని, తనను కలవాల్సిందిన స్టేట్ సార్టీ ప్రెసిడెంట్ అడిగారని, అయితే ఎంపీ పదవికి రాజీనామా విషయం అతనితో చెప్పానని గోపాల్ శెట్టి అన్నారు.

భారతదేశ స్వాతంత్ర పోరాటంలో క్రిస్టియన్లు పాల్గొనలేదంటూ ఇటీవల గోపాల్ శెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. క్రిస్టియన్లను విదేశీయులు అని కూడా గోపాల్ శెట్టి అన్నారు. హిందువులు, ముస్లింలు ఒక్కటిగా స్వాతంత్రం కోసం పోరాడారని, క్రిస్టియన్లు బ్రిటీష్ వారు అని,  ఆదివారం షాజా ఖబరస్తాన్ కమిటీ ఏర్పాటుచేసిన ఈద్-ఈ- మిలాద్ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 

Posted in Uncategorized

Latest Updates