క్రీడారంగం షాక్ : యాక్సిడెంట్ లో హాకీ ప్లేయర్లు అందరూ మృతి

కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐస్ హాకీ ప్లేయర్లతో వెళ్తోన బస్సు ఓ హైవేపై ట్రక్కును ఢీకొన్నది. ఆ ఘటనలో సుమారు 14 మంది జూనియర్ హాకీ ప్లేయర్లు అక్కడి కక్కడే మృతిచెందగా..14 మంది గాయపడ్డారు. దీంతో కెనడాలో విషాద చాయలు అలుముకున్నాయి. సస్‌కచివాన్ రాష్ట్రంలో ఈ ప్రమాదం జరిగింది. హమ్‌బోల్డ్ బ్రాంకోస్ టీమ్‌కు చెందిన ప్లేయర్లు ప్రమాదంలో చనిపోయారు. బస్సులో సుమారు 28 మంది ప్లేయర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడ్డ 14 మందికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ విషాదంపూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Posted in Uncategorized

Latest Updates