క్రూడాయిల్ బఫర్ స్టాక్ పెంచాలని నిర్ణయించిన కేంద్రం

VENAKKIదేశంలో క్రూడాయిల్ బఫర్ స్టాక్ పెంచాలని నిర్ణయించింది కేంద్రం. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒడిషాలోని చంఢీకోట్ లో 4 మిలియన్ మెట్రిక్ టన్నులు, కర్ణాటకలోని పాడూర్ లో 2.5 మిలియన్ మెట్రిక్ టన్నుల క్రూడాయిల్ ను నిల్వ ఉంచేందుకు అండర్ గ్రౌండ్ స్టోరేజీ ట్యాంకులు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే.. బీ మొలాసిస్, చెరుకు రసం నుంచి ఇథనాల్ తయారు చేయడానికి కేంద్రం ఓకే చెప్పింది. దీనిద్వారా చెరుకు రైతులకు మేలుజరుగుతుందన్నారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్.

Posted in Uncategorized

Latest Updates