క్రెడిట్ అంతా ధన్సికదే : ఆమె నటించిన సినిమాకు 8 అవార్డులు

DHANISJSకోలీవుడ్ హీరోయిన్ ధన్సిక నటించిన సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ధన్షిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమి సినం. ఈ మూవీ కోల్‌కతాలో జరిగిన అంతర్జాతీయ సంప్రదాయ సినిమా ఉత్సవాల్లో ఎనిమిది అవార్డులను సొంతం చేసుకుంది. వారం రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన, సంప్రదాయ అంశాలతో రూపొందిన వందలాది సినమాలు పోటీ పడ్డాయి. తమిళంలో నుంచి సినం పోటీ పడింది. అందులో భాగంగా ఉత్తమ నటిగా దన్షిక ఎంపికైంది.

ఈ సినిమాలో నటించిన పతిదా ఉత్తమ సహాయ నటిగా ఎంపికయ్యారు. సినిమాటోగ్రాఫర్‌ నటరాజన్‌, ఎడిటర్‌ దీపక్‌, సౌండ్‌ ఇంజినీరు సంపత్‌లకు కూడా ఉత్తమ అవార్డులు దక్కాయి. అంతేకాకుండా ఉత్తమ మహిళా సినిమా విభాగంలో కూడా ఈ మూవీ అవార్డులను సొంతం చేసుకుంది. మొత్తానికి ఎనిమిది అవార్డులను ఈ సినిమా అందుకోవడం విశేషం. తమిళనాడు నుంచి పశ్చిమబెంగాల్‌కు వెళ్లే ఓ యువతి.. అక్కడ వేరే గత్యంతరం లేక పడుపు వృత్తిని ఆశ్రయించే కథతో ఈ సినిమాను రూపొందించారు. ఇందులో వేశ్యపాత్ర పోషించారు దన్షిక. ఈ మూవీకి ఇంత పేరు రావడానికి ధన్సిక క్యారెక్టరే హైలెట్ అని, ఈ క్రెడిట్ అంతా అమెకేనని సంతోషం వ్యక్తం చేసింది సినిమా యూనిట్.

Posted in Uncategorized

Latest Updates