క్రెడిట్ గ్యారెంటీలు ఉన్నా.. చిన్న కంపెనీలకు లోన్​ దొరకట్లే

న్యూఢిల్లీ : క్రెడిట్ గ్యారెంటీలు ఉన్నప్పటికీ, కుటీర, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌‌ఎంఈలు) లోన్లు ఇవ్వడం తగ్గిపోయింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌‌‌‌బీఐ) డేటా ప్రకారం జూలై  చివరి నాటికి ఎంఎస్‌‌ఎంఈలకు లోన్లు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 4.96 శాతం తగ్గిపోయాయి. దేశ జీడీపీలో 25 శాతం వరకు కంట్రిబ్యూట్ చేసే చిన్న సంస్థల కోసం ప్రభుత్వం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌‌లను తెచ్చింది. ప్రభుత్వ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌‌లతో పాటు, ఆర్‌‌‌‌బీఐ కూడా చిన్న సంస్థలకు చౌకగా అప్పులు పుట్టేలా పలు చర్యలను తీసుకుంది. కానీ బ్యాంక్‌‌లు మాత్రం ఈ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌‌లను వినియోగించుకోవడం లేదు. ఈ స్కీమ్‌‌లు అంత ఎక్కువగా ప్రభావం చూపడం లేదని తెలిసింది. కరోనా షాక్‌‌తో అప్పులు ఇవ్వడం తగ్గిపోతూనే ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా తన రీసెర్చ్‌‌ నోట్‌‌లో పేర్కొంది. ఆగస్ట్ వరకు ఎంఎస్‌‌ఎంఈలకు జారీ చేసిన క్రెడిట్ అప్పులు రూ. లక్ష కోట్లుగా ఉన్నప్పటికీ, మొత్తంగా చూసుకుంటే అప్పులు దొరకడం తక్కువగానే ఉన్నట్టు డేటా చెబుతోంది . చిన్న సంస్థలకు సాయం చేసేందుకు ప్రభుత్వం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్‌‌ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద 100 శాతం గ్యారెంటీ ఇస్తోంది. ఈ ఏడాది మే నుంచి ఈ స్కీమ్‌‌ అమల్లోకి వచ్చింది. ఈ స్కీమ్ తెచ్చినప్పటికీ చిన్న సంస్థలకు లోన్లు అందుబాటులోకి రావడం లేదు. తమ అప్పులు తేలికగా దొరకడం లేదని చిన్న సంస్థలు అంటున్నాయి.

 

 

 

Latest Updates