క్రేజ్ తగ్గని గోలీసోడ : మస్త్ బిజినెస్ అంటున్న వ్యాపారులు

దాహం వేస్తే టక్కున గుర్తుకు వచ్చేది కూల్స్ డ్రింక్స్. రంగు రంగుల కలర్ లో ఎన్ని కూల్ డ్రింక్స్ వచ్చినా.. ఇప్పటికీ గోలిసోడ తాగే వారున్నారు. గోలి సోడ టేస్టే వేరంటున్నారు. మల్టీ నేషనల్ కంపెనీలు ఎన్ని డ్రింక్స్.. గోలిసోడ బిజినెస్ నడుస్తనే ఉందంటున్నారు వ్యాపారులు.కూల్ డ్రింక్స్ ఎన్నొచ్చినా.. గోలి సోడాకి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రయాణంలో అలిసి పోయిన వారు గతంలో ఈ గోలి సోడాను వెతుక్కుంటూ తాగుతుంటారు.

యాభై ఏళ్ల క్రితం పది పైసలకు దొరికే గోలి సోడా… ఇప్పుడు పది రూపాయలకు పెరిగినా.. సిటీలో ఇదే బిజినెస్ చేస్తూ ఇప్పటికీ ఉపాధి పొందే వారున్నారు. కూల్ డ్రింక్స్ రాకముందు.. ఇరవై ఏళ్ల క్రితం వరకు గోలిసోడాకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా హాల్స్.. షాపింగ్ మాల్స్.. రైల్వే స్టేషన్.. బస్టాండ్.. మెయిన్ సెంటర్ల దగ్గర ఈ బండ్లు ఉండేవి. మల్టీ నేషనల్ కంపెనీలకు చెందిన కూల్ డ్రింక్స్ రాకతో గోలీ సోడకి కొంత గిరాకీ తగ్గింది. అయినా….ఈ బిజినెస్ పై ఆధారపడ్డ వాళ్ళు ఇప్పటికీ  ఇదే వ్యాపారం చేస్తున్నారు.

ఆర్టీసి క్రాస్ రోడ్స్ లో గోలిసోడా అమ్ముతూ కనిపించే ఇతని పేరు అశోక్. 44ఏళ్లుగా సోడబండిని నమ్ముకుని వ్యాపారం చేస్తున్నారు. తమ సోడాకి ఏ మాత్రం క్రేజ్ తగ్గ లేదంటున్నారు. కూల్ డ్రింక్స్ ఎన్నున్నా… గోలిసోడా టేస్ట్ వేరంటున్నారు జనం. ఒకప్పటి గోలిసోడ.. రాను రాను నిమ్మసోడాగా మారిందంటున్నారు. అలిసిపోయిన తర్వాత గోలిసోడ తాగితే హాయిగా ఉంటుందని చెబుతున్నారు. జాబ్ లేదని బాధ పడే బదులు.. గోలిసోడ బిజినెస్ తో కుటుంబాన్ని పోషించడం సంతోషంగా ఉందంటున్నారు కొందరువ్యాపారులు.

Posted in Uncategorized

Latest Updates